ఆఫ్ఘనిస్తాన్..వెంటిలేటర్ల తయారీలో అమ్మాయిలు

ఆఫ్ఘనిస్తాన్ లో టీనేజీ అమ్మాయిలు ఓ బృహత్ కార్యక్రమం చేపట్టారు. కరోనా రోగులకోసం వారు వెంటిలేటర్లను తయారు చేస్తున్నారు. ఆశ్చర్యంగా కార్ల విడిభాగాలను సేకరించి వీటిని తయారు చేయడం విశేషం. ఇవి రోగులకు తాత్కాలిక రిలీఫ్ నిస్తాయని, ఎమర్జెన్సీ సమయంలో నాణ్యమైన వెంటిలేటర్లు లేనప్పుడు ఇవే ఎంతగానో తోడ్పడతాయని వారు అంటున్నారు. 14 నుంచి 17 ఏళ్ళ వయస్సులో ఉన్న ఈ బాలికలు ఎంతో నేర్పుగా  కార్ల స్పేర్ పార్ట్స్ నుంచి వీటిని తయారు చేయడం స్థానికులను […]

ఆఫ్ఘనిస్తాన్..వెంటిలేటర్ల తయారీలో అమ్మాయిలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 7:43 PM

ఆఫ్ఘనిస్తాన్ లో టీనేజీ అమ్మాయిలు ఓ బృహత్ కార్యక్రమం చేపట్టారు. కరోనా రోగులకోసం వారు వెంటిలేటర్లను తయారు చేస్తున్నారు. ఆశ్చర్యంగా కార్ల విడిభాగాలను సేకరించి వీటిని తయారు చేయడం విశేషం. ఇవి రోగులకు తాత్కాలిక రిలీఫ్ నిస్తాయని, ఎమర్జెన్సీ సమయంలో నాణ్యమైన వెంటిలేటర్లు లేనప్పుడు ఇవే ఎంతగానో తోడ్పడతాయని వారు అంటున్నారు. 14 నుంచి 17 ఏళ్ళ వయస్సులో ఉన్న ఈ బాలికలు ఎంతో నేర్పుగా  కార్ల స్పేర్ పార్ట్స్ నుంచి వీటిని తయారు చేయడం స్థానికులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.  హెరాత్ ప్రావిన్స్ లో నివసిస్తున్న వీరంతా ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు. ఈ దేశంలో 7,650 కరోనా కేసులు నమోదు కాగా.. 178 మంది రోగులు మరణించారు. 38.9 మిలియన్ జనాభా ఉన్న ఈ దేశంలో సుమారు నాలుగు వందల వెంటిలేటర్లే ఉన్నాయట.. ఈ నెలాఖరుకు తమ సభ్యులు కొన్ని వందల వెంటిలేటర్లను తయారు చేయగలుగుతారని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న రోయా మెహబూబ్ తెలిపారు. పాత టయోటా కారు  నుంచి, హొండా బైక్ నుంచి తమ గ్రూప్ అమ్మాయిలు రక రకాల ప్రోటోటైప్ నమూనాలను తయారు చేసినట్టు ఆమె చెప్పారు.