కరోనా కాలం.. ఉగ్రవాదిని భారత్‌కి పంపనున్న అమెరికా..!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి రోజోరోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్కడ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గురువారం విడుదల చేశారు.

కరోనా కాలం.. ఉగ్రవాదిని భారత్‌కి పంపనున్న అమెరికా..!
Follow us

| Edited By:

Updated on: May 21, 2020 | 8:44 PM

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి రోజోరోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్కడ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గురువారం విడుదల చేశారు. అందులో ఆల్ ఖైదా ఉగ్రవాది జుబేర్ మహ్మద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. ఎన్నో ఉగ్రవాద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జుబేర్‌ను 2015లో అమెరికా అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి అక్కడి జైల్‌లో అతడు శిక్షను అనుభవిస్తున్నాడు. ఆంతేకాదు ఆల్ ఖైదా తరఫున ఎక్కువ మొత్తంలో నిధులు సమీకరించిన కేసులో కూడా ఈ ఉగ్రవాది దోషిగా ఉన్నాడు.

ఇక జుబేర్ మహ్మద్ హైదరాబాద్‌కి చెందిన వాడు కావడంతో.. అతడిని భారత్‌కి పంపించాలని అమెరికా నిర్ణయించింది. ఈ క్రమంలో ఓ ప్రత్యేక విమానంలో అతడిని మన దేశానికి పంపేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మరోవైపు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. జుబేర్ భారత్‌లోకి దిగగానే అతడిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్‌కి పంపాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: ఓటీటీలో రిలీజ్‌.. ‘నో’ చెప్పిన ‘ఉప్పెన’ మేకర్స్..!