ఓటీటీలో రిలీజ్‌.. ‘నో’ చెప్పిన ‘ఉప్పెన’ మేకర్స్..!

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ ఉప్పెన.

ఓటీటీలో రిలీజ్‌.. 'నో' చెప్పిన 'ఉప్పెన' మేకర్స్..!
Follow us

| Edited By:

Updated on: May 21, 2020 | 8:20 PM

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్‌ కృతి శెట్టికి కూడా ఈ సినిమా మొదటి కావడం విశేషం. అయితే వీరందరూ కొత్త వాళ్లు అయినప్పటికీ ఇందులో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించడం, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందించడం, సుకుమార్‌ రైటింట్స్‌- మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక మరోవైపు ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో.. సినిమాపై అందరిలో ఆసక్తి కలిగింది.

అయితే ఉన్నట్లుండి కరోనా రావడంతో ఈ మూవీ విడుదల కాలేకపోయింది. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. దాదాపు తక్కువ బడ్జెట్ సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఉప్పెన కూడా ఆన్‌లైన్‌లోనే రాబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే మేకర్లు మాత్రం ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరట. ఎందుకంటే ఆ ఫ్లాట్‌ఫాంలో మిగిలిన చిన్న సినిమాలు ఎలా ఢీల్ చేసుకుంటున్నారో ఉప్పెనకు కూడా అలాంటి ఆఫర్ ఇస్తున్నారట. అయితే అందరూ కొత్త వారైనప్పటికీ.. ఈ మూవీ కోసం నిర్మాతలు దాదాపుగా రూ.18కోట్లు ఖర్చు చేశారు. అయితే హీరోకు మెగా సపోర్ట్‌ ఉండటంతో పాటు ఇందులో సుకుమార్ హ్యాండ్ కూడా ఉండటంతో.. ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ చేసినా.. ఆ డబ్బును తిరిగి తెచ్చుకోవచ్చన్న ధీమాలో మేకర్లు ఉన్నారట. ఈ క్రమంలో ఈ సినిమాను ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసేందుకు వారు ఏ మాత్రం సముఖంగా లేరన్నది సమాచారం.

Read This Story Also:  మనోజ్‌కి ఎన్టీఆర్ చెప్పే ‘బ్రహ్మ’ కథ.. అబ్బో భలే ఇంట్రెస్టింగ్‌గా ఉందే..!

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..