బికినీ డ్రస్సులో.. కరోనా రోగులకు నర్సు సేవలు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రాకాసి కోరల్లోంచి బయటపడేసేందుకు వైద్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు. వైద్యులకు తోడు నర్సులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కుటుంబసభ్యులు సైతం దరిచేరని వారి మధ్య నర్సులు సేవలందిస్తున్నారు. కానీ రష్యాకి చెందిన ఓ నర్సు చేసిన పనికి అందరూ విస్తుపోతున్నారు. రష్యాలోని టులా నగరానికి చెందిన ఒక ఆస్పత్రిలో ఓ యువతి నర్సుగా సేవలందిస్తోంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ఆస్పత్రి యాజమాన్యం పీపీఈ కిట్లను అరెంజ్ చేసింది. […]

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రాకాసి కోరల్లోంచి బయటపడేసేందుకు వైద్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు. వైద్యులకు తోడు నర్సులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కుటుంబసభ్యులు సైతం దరిచేరని వారి మధ్య నర్సులు సేవలందిస్తున్నారు. కానీ రష్యాకి చెందిన ఓ నర్సు చేసిన పనికి అందరూ విస్తుపోతున్నారు. రష్యాలోని టులా నగరానికి చెందిన ఒక ఆస్పత్రిలో ఓ యువతి నర్సుగా సేవలందిస్తోంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ఆస్పత్రి యాజమాన్యం పీపీఈ కిట్లను అరెంజ్ చేసింది. అయితే, అందరూ తమ దుస్తులపైనే పీపీఈ కిట్లను ధరించినా.. ఆ నర్సుకు మాత్రం తన దుస్తులపై నుంచి పీపీఈ కిట్ ధరించడం ఇబ్బందిగా పీలైంది. ఉక్కపోతగా ఉందంటూ డ్రెస్సును పక్కన పడేసి కేవలం లోదుస్తులను మాత్రమే వేసుకుంది. వాటిపై పీపీఈ కిట్‌ను మాత్రమే ధరించింది. అట్లాగే కరోనా పేషెంట్లకి సేవలందిస్తుంది. అయితే, పీపీఈ కిట్ నుంచి తన శరీరం క్లియర్‌గా బయటకు కనిపిస్తున్నా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు వార్డుకు తిరుగుతూ కరోనా రోగులకు సేవలు అందించింది. ఆమె నిర్ణయానికి ఆస్పత్రి యాజమాన్యం సైతం అడ్డు చెప్పలేకపోయింది. అయితే, నర్సు వేషధారణ నచ్చని ఓ కరోనా పేషెంట్.. ఆమెను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సు ఇంత అసభ్యంగా ప్రవర్తించడం దారుణమంటూ తిట్టి పోస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆ దేశ వైద్య, ఆరోగ్య శాఖ సదరు నర్సుపై చర్యలకు ఆదేశించింది.
