ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనమిత్ర అమలుకు ఉత్తర్వులు జారీ..

కరోనా కష్టకాలంలో ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పధకం అమలు కోసం జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పధకం ద్వారా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కుని నడుపుకుంటూ.. […]

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనమిత్ర అమలుకు ఉత్తర్వులు జారీ..
Follow us

|

Updated on: May 22, 2020 | 12:11 AM

కరోనా కష్టకాలంలో ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పధకం అమలు కోసం జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పధకం ద్వారా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కుని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి రూ. 10 వేలు ఇవ్వనున్నారు. రెండో విడతలో సుమారు 2,36,344 మందికి ఆర్ధిక సాయం అందనుంది. జూన్ 4న లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానుండగా.. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియను మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో.. ఆగిపోయిన కార్యకలాపాలన్నీ మళ్లీ ప్రారంభమయ్యాయి. అటు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కాయి.

Read This: స్విగ్గీతో మద్యం హోం డెలివరీ.. మందుబాబులు ఫుల్ హ్యాపీ..