AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ilaiyaraaja: చిక్కుల్లో రజినీకాంత్ సినిమా.. నిర్మాణ సంస్థకు నోటీసులు పంపిన ఇళయరాజా.. ఎందుకంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏడుపదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ అడియన్స్ ముందుకు వస్తున్నారు. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తలైవా.. ఇప్పుడు కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.

Ilaiyaraaja: చిక్కుల్లో రజినీకాంత్ సినిమా.. నిర్మాణ సంస్థకు నోటీసులు పంపిన ఇళయరాజా.. ఎందుకంటే..
Rajinikanth, Ilayaraja
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 9:42 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏడుపదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ అడియన్స్ ముందుకు వస్తున్నారు. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తలైవా.. ఇప్పుడు కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే కూలీ చిత్రయూనిట్‏కు షాకిచ్చారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా. కూలీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కు నోటీసులు పంపించారు. ఈ సినిమాలో తన అనుమతి లేకుండానే తన మ్యూజిక్ ఉపయోగించుకున్నారని నోటీసులో తెలిపారు ఇళయరాజా. ఈ మేరకు సన్ పిక్చర్స్ సంస్థకు లీగల్ కాపీరైట్ నోటీసులు జారీ చేశారు.

ఇటీవలే కూలీ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో రజినీకాంత్ నటించిన తంగమగన్ మూవీలోని “వా వా పక్కం వా” పాటలోని మ్యూజిక్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా ఉపయోగించిన ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని.. లేదంటే పాటకు తగిన అనుమతి పొందాలని సన్ పిక్చర్స్ కు ఇళయరాజా నోటీసులు పంపించారు. ఒకవేళ అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే తన సంగీతంలోని పాటలను తన అనుమతి లేకుండా స్టేజ్ షోలలో పాడకూడదని.. సినిమాల్లోనూ ఉపయోగించరాదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. వాటిని అతిక్రమించిన వారిపై ఆయన కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇళయరాజా లీగల్ నోటీసు పై సన్ పిక్చర్స్ ఇంకా స్పందించలేదు. ఇప్పటికే టైటిల్ టీజర్ విడుదలైన కారణంగా కూలీ చిత్రయూనిట్ వీలైనంత త్వరగా ఇళయరాజా నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కూలీ చిత్రంలో శృతిహాసన్, సత్యరాజ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బంగారు స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us