AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HariHara Veera Mallu Teaser: ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్ అదిరిందిగా..

ఎట్టకేలకు హరిహర వీరమల్లు మూవీ టీజర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం చాలాకాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఇన్నాళ్లకు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

HariHara Veera Mallu Teaser: ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్ అదిరిందిగా..
Harihara Veeramallu Teaser
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 9:22 AM

Share

ఎట్టకేలకు హరిహర వీరమల్లు మూవీ టీజర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం చాలాకాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఇన్నాళ్లకు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. మొఘల్స్ కాలంలో రాజులు, నవాబులు అందరూ ప్రజలపై దాడి చేస్తూ వారి శ్రమను దోచుకుంటుంటే.. వాళ్లను దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు అంటూ టీజర్ లో చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ లో పవన్ చేయనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.

ఈ సినిమాలో ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిజానికి ఎప్పుడో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన ఆ తర్వాత మాత్రం అంతగా అప్డేట్స్ రివీల్ చేయలేదు. దీంతో ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న రూమర్స్ పై అటు మేకర్స్ సైతం స్పందించకపోవడంతో నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలు నిజమే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ చేస్తూ రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టేసింది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అదిరిపోయింది. అలాగే సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాలన్ని కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న హరిహర వీరమల్లు సినిమా గ్రాఫిక్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.