AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి.. తెలుగులో ఆమెకు స్పెషల్ ఫాలోయింగ్..

ఫోటోను చూశారు కదా.. అందులో తల్లిపక్కనే కనిపిస్తున్న చిన్నారి తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అగ్రకథానాయికగా కొనసాగింది. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పేసి ఫ్యామిలీతో సమయం గడుపుతుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?..

Tollywood: అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి.. తెలుగులో ఆమెకు స్పెషల్ ఫాలోయింగ్..
Actress
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 9:04 AM

Share

ప్రతిరోజు సోషల్ మీడియాలో తారల చిన్ననాటి ఫోటోస్ వైరలవుతుంటాయి. ఎక్కువగా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ట్రెండ్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్స్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ కోసం మరో సినీతార ఫోటో తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. అందులో తల్లిపక్కనే కనిపిస్తున్న చిన్నారి తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అగ్రకథానాయికగా కొనసాగింది. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పేసి ఫ్యామిలీతో సమయం గడుపుతుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఆమె భర్త కూడా ఇండస్ట్రీలో టాప్ హీరో. ఇంతకీ ఆమె ఎవరంటే.. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్.. హా.. హా.. హాసిని.. అలియాస్ జెనిలియా.

తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది జెనీలియా. తుజే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. చాలా కాలంపాటు ప్రేమలో ఉన్న వీరు.. పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఇటీవలే వేద్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ సినిమాకు హిందీ రీమేక్ ఇది. ఇందులో చైతూ పాత్రలో రితేష్ నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

బాయ్స్ సినిమాతో తెలుగు, తమిళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జెనీలియా.. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో హాసిని పాత్రలో ఆమె నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో జెనీలియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌