Rajamouli-Anil Ravipudi: అనిల్ రావిపూడిని కొట్టినవాళ్లకు పదివేలు ఇస్తా.. రాజమౌళి సంచలన కామెంట్స్..

ఇన్నాళ్లు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. అలాగే ఫిట్నెస్, హెల్త్, లుక్స్ ఇలా ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహేష్. మరోవైపు జక్కన్న సైతం కొన్ని నెలలుగా ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Rajamouli-Anil Ravipudi: అనిల్ రావిపూడిని కొట్టినవాళ్లకు పదివేలు ఇస్తా.. రాజమౌళి సంచలన కామెంట్స్..
Rajamouli, Anil Ravipudi
Follow us

|

Updated on: May 02, 2024 | 7:52 AM

ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను సైతం ఫిదా చేశారు డైరెక్టర్ రాజమౌళి. దీంతో ఇప్పుడు జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని గతంలోనే అనౌన్స్ చేశాడు జక్కన్న. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇన్నాళ్లు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. అలాగే ఫిట్నెస్, హెల్త్, లుక్స్ ఇలా ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహేష్. మరోవైపు జక్కన్న సైతం కొన్ని నెలలుగా ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఓవైపు మహేష్ సినిమా కోసం అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్న జక్కన్న మరోవైపు పలు మూవీ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తాజాగా టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కృష్ణమ్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ వేడుకలలో జక్కన్నతోపాటు మాస్ డైరెక్టర్ కొరటాల శివ, డైరెక్టర్ అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ అనిల్ రావిపూడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ముందుగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కొరటాల శివగారు.. రాజమౌళి గారు వచ్చారు కాబట్టింది. కొరటాల శివగారు దేవ అప్డేట్.. రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా కనీసం ఓపెనింగ్ ఎప్పుడో చెప్పాలి అని అన్నారు. ఇక ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ.. “ఎవరైనా కెమెరా పట్టుకుని వెనకాలే వెళ్లి అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తాను” అని అన్నారు. జక్కన్న మాటాలకు స్టేజ్ పైనే ఉన్న అనిల్ రావిపూడి రియాక్షన్ నవ్వులు పూయించాయి. అయితే రాజమౌళి సరదాగానే ఆ కామెంట్స్ చేసినా.. కోపం వచ్చి అలా కౌంటరిచ్చారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం జక్కన్న చేసిన కామెంట్స్ మాత్రం నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles