AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? అమ్మను మించిన అందం అమ్మాయి సొంతం.. ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని తన భర్త చెప్పలేదని.. కానీ కుటుంబానికి ప్రాముఖ్యత.. పిల్లల కారణంగా అక్కడే ఉండిపోయినట్లు లయ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు లయ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? అమ్మను మించిన అందం అమ్మాయి సొంతం.. ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
Laya
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 1:15 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ లయ. అందం, అభినయంతో అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది. తనదైన నటనతో ఇప్పటికీ జనాల మనసుల్లో అందమైన కథానాయికగా ప్లేస్ సొంతం చేసుకుంది. భద్రం కొడుకో సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత హీరో వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో లయకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లపాటు అగ్రకథానాయికగా రాణించింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది.

తెలుగులో చివరగా బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించింది. అమెరికాకు చెందిన డాక్టర్ గణేష్ గోగుర్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని తన భర్త చెప్పలేదని.. కానీ కుటుంబానికి ప్రాముఖ్యత.. పిల్లల కారణంగా అక్కడే ఉండిపోయినట్లు లయ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు లయ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

లయ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు శ్లోకా ఇప్పటికే బాలనటిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మాహరాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. తల్లిలాగే శ్లోక కూడా ఎంతో అందంగా ఉంటుంది. అచ్చం అమ్మ అందమే కూతురికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇటీవల తన కూతురితో కలిసి ఓ ఫోటోను షేర్ చేసింది లయ. అందులో వారిద్దరు అచ్చం అక్కచెల్లెళ్లుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక తన కూతురు హీరోయిన్ గా నటిస్తే చూడాలని ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది లయ.

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.