AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం.. మోదీ సహా అగ్రనేతలతో సభలు, రోడ్‌ షోలకు ప్లాన్

తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్‌షా టూర్‌... తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో అయితే అమిత్‌షా రోడ్‌షో ఒక రేంజ్‌లో సాగింది. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. హైదరాబాద్‌ ఎంపీ సీటును సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు దూసుకెళ్తోంది.

Telangana BJP: డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం.. మోదీ సహా అగ్రనేతలతో సభలు, రోడ్‌ షోలకు ప్లాన్
Modi Yogi Amit Shah
Balaraju Goud
|

Updated on: May 02, 2024 | 8:57 AM

Share

తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్‌షా టూర్‌… తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో అయితే అమిత్‌షా రోడ్‌షో ఒక రేంజ్‌లో సాగింది. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. హైదరాబాద్‌ ఎంపీ సీటును సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు దూసుకెళ్తోంది. పాతబస్తీలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారంతో పొలిటికల్‌ హీట్ మరింత పీక్స్‌కు చేరనుంది.

రోడ్‌షో తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు అమిత్‌షా. దాదాపు గంటపాటు ఈ సమావేశాలు జరిగాయి. ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరగబోతోందని, కచ్చితంగా 12 స్థానాలు గెలవబోతున్నట్టు అమిత్ షా చెప్పారు. కొంచెం కష్టపడితే మరో రెండు సీట్లు కూడా సాధించవచ్చన్నారు అమిత్‌షా. మరో రెండుసార్లు తెలంగాణకు రానున్నట్టు తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పారు అమిత్‌షా. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నట్లు అమిత్ షా తెలిపారు. రెండు రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. మే 8న వరంగల్‌, కరీంనగర్‌లో, అలాగే మే 10వ తేదీన మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌లో నిర్వహించే బహిరంగసభలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు.

ఇక, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా కన్వీనర్లకు కీలక సూచనలు చేశారు అమిత్‌షా. బీజేపీకి మంచి వాతావరణం ఉందని, బూత్‌స్థాయిలో కష్టపడితే 12నుంచి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ప్రతి ఓటరును కలిసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు అమిత్‌షా.

తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే నామినేషన్‌ కోసం బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు.

కాగా, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా.. నాలుగో దశలో మే 13న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us