TOP9 ET: గుడ్‌ న్యూస్‌.! ప్రభాస్‌ భారీ ఈవెంట్ | వావ్.! మరో ప్రెస్టీజియస్ సినిమాలో సూర్య.

TOP9 ET: గుడ్‌ న్యూస్‌.! ప్రభాస్‌ భారీ ఈవెంట్ | వావ్.! మరో ప్రెస్టీజియస్ సినిమాలో సూర్య.

Anil kumar poka

|

Updated on: May 17, 2024 | 8:41 PM

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న కల్కి సినిమా జూన్ 27న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ ఈవెంట్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మే 22న రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి 2898 ఏడికి సంబంధించిన పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 156వ చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్ అవుతోంది.

01.Kalki: గుడ్‌ న్యూస్‌.! ప్రభాస్‌ భారీ ఈవెంట్.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న కల్కి సినిమా జూన్ 27న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ ఈవెంట్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మే 22న రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి 2898 ఏడికి సంబంధించిన పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

02. Viswambhara: విజయశాంతి నో.. ఖుష్బూ ఎస్‌.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 156వ చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ నటి ఖుష్బూ నటిస్తున్నారు. ముందుగా ఈ పాత్రకు విజయశాంతిని సంప్రదించినా, ఆమె నో చెప్పడంతో ఖుష్బూను ఫైనల్ చేశారట.

03.Kangana: బ్యాడ్ లక్…! మళ్లీ వాయిదా..!

కంగన రనౌత్ నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కంగన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

04. Surya: వావ్ ! మరో ప్రెస్టీజియస్ సినిమాలో సూర్య.

సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కంగువాతో పాటు ఆకాశమే హద్దురా ఫేమ్ సుధా కొంగరతో మరో సినిమా చేస్తున్నారు సూర్య. తాజాగా తన 44 వ చిత్రాన్ని కూడా ప్రకటించారు సూర్య. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.

05.Aranmanai 4: రూ.50 కోట్ల సినిమా.. అక్కడ కూడా..

రాశీ ఖన్నా, తమన్నా కీలక పాత్రల్లో సుందర్ సి తెరకెక్కించిన సినిమా అరణ్మణై 4. ఆయనే హీరోగా నటించారు. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రానికి తమిళంలో 50 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. మే 24న అరణ్మణై 4 హిందీ వెర్షన్ విడుదల కానుంది.

06. Devara: దేవర అప్‌డేట్

చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అప్‌డేట్ గురించి చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. మే 19న దేవర ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా వార్ 2 లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్ రానుంది.

07.Mehreen: అలా తప్పుగా రాస్తే ఎలా..?

సౌత్ బ్యూటీ మెహరీన్‌ తన మీద తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థల మీద ఫైర్ అయ్యారు. ఇటీవల తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ బోల్డ్ అప్‌డేట్ ఇచ్చారు మెహరీన్‌. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎగ్‌ ఫ్రీజింగ్‌ను ఎంపిక చేసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ వార్తలను కొన్ని వెబ్‌ సైట్స్‌లో తప్పుగా రాయటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

08.Mrunal: డేటింగ్ లో మృణాల్..!

సౌత్, నార్త్ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్ ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్‌తో కలిసి కనిపించారు. దీంతో అతనితో మృణాల్‌ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై మృణాల్ టీమ్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

09.gouda: పద్దతంతా సీరియల్లోనే… బయట వేరే!

అమూల్య గౌడ! గుండెనిండా గుడిగంటలు సీరియల్తో తెలుగు ప్రేమక్షకుల మనుసులు కొల్లగొట్టిన ఈ బ్యూటీ… ఓ కన్నడ బ్యూటీ..! కన్నడ భాషలో శ్రీ గౌరీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది. అలా తెలుగు టెలివిజన్‌ ఇండస్ట్రీలో ల్యాండ్‌ అయి దూసుకుపోతోంది. అయితే సీరియల్స్ లో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా హాట్. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడంలో అయితే వేరే లెవల్‌. అందుకే నెట్టింట ఎప్పుడూ అవుతుంటుంది హాట్ టాపిక్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.