ANIL KUMAR

దేవర-గేమ్ ఛేంజర్ స్టోరీ ఒకటేనా.? వీటి పోలికలు తెలిస్తే షాక్ అవుతారు.

02 May 2024

ఎన్టీఆర్ దేవర - రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈ రెండు సినిమాలు కూడా రివేంజ్ డ్రామా జోనర్లో వస్తున్నా సినిమాలు.

ఈ రెండు సినిమాలను పోలుస్తూ కొన్ని కామన్ పాయింట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి ఏంటో చూద్దాం.!

ఈ రెండు సినిమాల్లో నటిస్తున్న కామన్ నటుడు శ్రీకాంత్.. ఈయన గేమ్ చెంజర్ పాత్రపై క్లారిటీ ఉన్న దేవర పాత్రలో స్పష్టత లేదు.!

ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో.. చెర్రీ - తారక్ ఇద్దరు కూడా ద్విపాత్ర (డ్యూయల్ రోల్ ) చేస్తునట్టు సమాచారం.

ఈ రెండు సినిమాల్లో కూడా ఒక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ - దేవర లో జాన్వీ కపూర్.. ఈ ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కావడం విశేషం.

దేవర మూవీ బడ్జెట్ సుమారు రూ. 300-350 కోట్లు అని సమాచారం. అలాగే గేమ్ ఛేంజర్ కూడా రూ. 300 కోట్ల పైనే అని టాక్.

గేమ్ ఛేంజర్ లో పొలిటికల్ పార్టీ పెట్టిన తండ్రి కోసం రివెంజ్ తీర్చుకునే కొడుకుగా చెర్రీ క్యారెక్టరని వినిపిస్తుంది.

అలాగే దేవర లో కూడా దేవ గా తండ్రి పాత్ర సీ పోర్ట్ వార్ లో చనిపోగా.. కొడుకు వర పాత్రలో వచ్చి రివెంజ్ తీసుకుంటాడు అని టాక్.