AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పోరులో.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కరోనా వణికిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచేకొద్ది పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి ఉధృతి నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే..తప్పనిసరిగా ఇలా చేయండి అంటూ ఓ విధానాన్ని వివరించింది. 

కరోనా పోరులో.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు
Jyothi Gadda
|

Updated on: Jul 07, 2020 | 1:12 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కరోనా వణికిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచేకొద్ది పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి ఉధృతి నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే..తప్పనిసరిగా ఇలా చేయండి అంటూ ఓ విధానాన్ని వివరించింది.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన కొత్త మార్గదర్శకాల మేరకు.. కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు తక్కువగా ఉన్నవారికి పదిరోజులపాటు వైద్యం అందిస్తారు. ఇక వరుసగా మూడు రోజులపాటు జ్వరం కనుక లేదంటే…వారిని డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన తరువాత వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే తిరిగి వెంటనే వారు ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుందని సూచించారు. దీనికి సంబంధించి 1075 అనే హెల్ప్ నెంబర్ ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉండి, ఆక్సిజన్ అవసరమైతే వారిని జిల్లా కోవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేయనున్నారు. అక్కడ లక్షణాలు 3 రోజుల్లో తగ్గిపోతే మరో నాలుగు రోజులపాటు పరీక్షించి అప్పుడు ఇంటికి పంపిస్తారు.

ఇకపోతే, జ్వరం, శ్వాసకు సంబంధించిన సమస్యలు లేనివాళ్లను ఎలాంటి పరీక్షలు లేకుండా ఇళ్లకు పంపిస్తారట. అయితే, ఇమ్మ్యూనిటి శక్తి తక్కువగా ఉండి, వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే అలాంటి వారిని పూర్తిగా కోలుకున్నాకే తిరిగి ఇంటికి పంపనున్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు వారు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

కాగా, ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం చేస్తున్న కరోనా టెస్టులు 10లక్షలు దాటిపోయాయి. రాబోయే రోజుల్లోనూ ఈ సంఖ్య మరింత పెంచాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కరోనా లక్షణాలు, అనుమానం ఉన్నవాళ్లు వెంటనే టెస్టులు చేయించుకోవచ్చు. రిపోర్ట్ కూడా మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుందని సూచించారు. లక్షణాలు ఉన్న వారికి టెస్టులు ఉచితంగానే చేస్తోంది ప్రభుత్వం.

Follow Us
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..