AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగర వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులకు అంతా సిద్ధం!

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా సుమారు 50 రోజుల పాటు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కరోనా వల్ల దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇక ఒక్కోక్కటిని తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో రవాణా వ్యవస్థ నెమ్మదిగా మొదలయ్యింది…రైళ్లు పట్టాలెక్కుతున్నాయి.. ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తున్నాయి… ఎప్పటిలాగే రైల్వే స్టేషన్‌లు సందడిగా మారాయి. అటు సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రయాణీకులతో సందడిగా మారింది. బెంగళూర్ టూ […]

భాగ్యనగర వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులకు అంతా సిద్ధం!
Ravi Kiran
|

Updated on: May 13, 2020 | 9:03 AM

Share

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా సుమారు 50 రోజుల పాటు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కరోనా వల్ల దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇక ఒక్కోక్కటిని తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో రవాణా వ్యవస్థ నెమ్మదిగా మొదలయ్యింది…రైళ్లు పట్టాలెక్కుతున్నాయి.. ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తున్నాయి… ఎప్పటిలాగే రైల్వే స్టేషన్‌లు సందడిగా మారాయి. అటు సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రయాణీకులతో సందడిగా మారింది. బెంగళూర్ టూ ఢిల్లీ రాజధాని స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ చేరుకుంది. ఈ ట్రైన్‌లో బెంగళూర్ నుంచి సికింద్రాబాద్‌కు 243 మంది ప్యాసింజర్లు వచ్చారు. ఇక సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 288 మంది ప్రయాణికులు పయనమయ్యారు.

ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే భాగ్యనగరంలో మెట్రో సర్వీసులు కూడా ఓపెనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో మెట్రో ట్రైన్స్‌ మళ్లీ పట్టాలెక్కే ఛాన్స్‌ ఉందంటున్నారు అధికారులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్‌లైన్స్‌ మేరకు రైళ్లను నడిపేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంతవరకు ఒక్కో బోగీలో సగం మంది ప్రయాణికులకు అనుమతినిచ్చి రైలు నడపాల్సి వస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి.. అంటే ఓ రైలులో ఇంతకు ముందు వెయ్యి మంది ప్రయాణిస్తే ఇప్పుడా సంఖ్య 500లకు మించి ఉండదన్నమాట.

దాంతో పాటు ప్రతీస్టేషన్‌లో రైలు ఆపే పరిస్థితి ఉండదు.. కాసింత రద్దీగా ఉన్న స్టేషన్‌లలోనే స్టాపులు ఉంటాయి. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం మెట్రో ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకు ముందులా రైలులో ప్రయాణించే వీలుండదు. ఒక్కో రైలులో మహా అయితే 5వందల మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. బోగీల్లోనూ తెల్లరంగు మార్కర్‌తో మార్క్‌ చేసి ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిల్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

Read This: మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ప్రభుత్వం బంపర్ ఆఫర్..

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?