MEIL: మరోసారి దాతృత్వం చాటుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా

MEIL: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్​ కేసులతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది.

MEIL: మరోసారి దాతృత్వం చాటుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా
Megha Engineering And Ingrastructures Limited Group
Follow us
Sanjay Kasula

|

Updated on: May 12, 2021 | 2:32 PM

ఆక్సిజన్ కొరత అమాయకుల ప్రాణాలను తీస్తోంది. ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా… ఆక్సిజన్ కొరత కారణంగా ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తోంది మేఘా ఇంజనీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌. బీ టైప్‌ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేయనుందా సంస్థ. పెరుగుతున్న రోగులతో పోల్చుకుంటే ఆక్సిజన్ సరిపోవడం లేదని… అందుకే ప్రాణవాయువు అందించే మెగా సాయానికి రెడీ అయింది మేఘా సంస్థ. తెలంగాణ ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు పంపించింది.

7వేల లీటర్ల సామర్థ్యం ఉన్న 500 నుంచి 600 ఆక్సిజన్‌ సిలిండర్లు సరఫరా చేయాలని మేఘా సంస్థ ప్రతిపాదించింది. దీని వల్ల రోజుకు 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆసుపత్రులకు సరఫరా చేయొచ్చని తన ప్రతిపాదనల్లో పేర్కొందీ సంస్థ. నిమ్స్‌, సరోజనీ దేవీ ఐ హాస్పిటల్, అపోలో ఆసుపత్రి, కేర్‌హైటెక్‌ హాస్పిటల్‌ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిమ్స్‌కు రోజు 50, సరోజనీ ఐ హాస్పిటల్‌కు 200, అపోలో ఆసుపత్రికి 100 కేర్‌ హైటెక్‌ ఆసుపత్రికి 50 సిలిండర్లు అవసరం ఉందని ఆయా హాస్పిటల్స్‌ ప్రపోజల్ పంపించాయి. ప్యూచర్‌లో పెంచే బెడ్స్‌కు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాను పెంచాలి విజ్ఞప్తి చేశాయి. వాళ్ల రిక్వస్ట్‌కు స్పందించిన మేఘా సంస్థ ప్లాంట్ల నిర్మాణం, ఆక్సిజన్ సరఫరాకు ఆంగీకరించింది.

ప్రస్తుత ఆక్సిజన అవసరాలకు సరిపడా ఉత్పత్తి పెంచేందుకు డీఆర్‌డీవో టెక్నికల్ హెల్ప్‌ తీసుకోనుంది మేఘా సంస్థ. డీఆర్‌డీవో సహకారంతో 30 నుంచి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు ప్లాన్ చేసింది. యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఆన్‌బోర్డు ఆక్సిజన్ ఉత్పత్తికి యూజ్‌ చేసే టెక్నాలజీతో ఈ ప్లాంట్లు రెడీ అవుతున్నాయి. ఇవి వినియోగంలోకి వస్తే… ప్రతి ప్లాంట్‌ నిమిషానికి 100 నుంచి 150 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలవు. ఈ ప్రాజెక్టును డీఆర్‌డీవో డైరెక్టర్‌ కల్నల్‌ బీఎస్‌ రావత్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు పర్యవేక్షిస్తున్నారు.

మేఘా సంస్థ ప్రస్తుతం రోజుకు 30 మెట్రిక్‌ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్‌ను లిక్విడ్ ఆక్సిజన్‌గా మారుస్తోంది. ఇలాంటిదే భద్రాచలంలోని ఐటీసీ వద్ద ఏర్పాటు చేయనుంది. దీంతో మరో 30 టన్నుల క్రయోజనిక్‌ ఆక్సిజన్ వైద్యావసరాల కోసం అందుబాటులోకి రానుంది. అవసరమైతే స్పెయిన్‌లోని తన సొంత యూనిట్ నుంచి 10-15 క్రయోజనిక్‌ ఆక్సిజన్ ట్యాంకులను దిగుమతి చేయసుకోవడానికి సిద్ధంగా ఉందీ మేఘా సంస్థ. ఇదంతా లిక్విడ్‌ ఆక్సిజన్ సరఫరా, నిల్వకు చాలా యూజ్‌ఫుల్‌ కానుంది.

ఇవి కూడా చదవండి : Lockdown: నేటి నుంచి తెలంగాణలో కఠిన లాక్‌డౌన్.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి.. ఇవే.!

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..