మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

రాష్ట్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే..

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 9:37 PM

రాష్ట్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు, జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు సరిగ్గా అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యలను ఆరా తీశారు. కంటైన్మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాల సరుకులు అందచేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ సోకి గాంధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మరణాలు రేటు జాతీయ సగటుకన్నా తక్కువ వుండడం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్‌ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని సీఎం అన్నారు.

‘‘సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశ వ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా రేపటి కాన్ఫరెన్స్‌లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

తన దారిలోకి వెళ్లి నేనేం సలహాలు ఇస్తాను? పవన్ పార్టీపై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Latest Articles
హానర్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లు..
హానర్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లు..
బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌
బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌
పిల్లల్ని ఏ వయసు నుంచి స్కూల్‌కి పంపాలో మీకు తెలుసా?
పిల్లల్ని ఏ వయసు నుంచి స్కూల్‌కి పంపాలో మీకు తెలుసా?
కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో ఫోన్‌.. ఏమన్నా ఫీచర్సా అసలు..
కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో ఫోన్‌.. ఏమన్నా ఫీచర్సా అసలు..
టీ 20 ప్రపంచకప్.. టీమిండియాకు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీకి గాయం!
టీ 20 ప్రపంచకప్.. టీమిండియాకు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీకి గాయం!
లో బడ్జెట్ హీరోను పెట్టి.. ఓ హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..
లో బడ్జెట్ హీరోను పెట్టి.. ఓ హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..
పొట్ట గుట్టలా మారిందని బాధపడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌తో..
పొట్ట గుట్టలా మారిందని బాధపడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌తో..
మంచుకొండల్లో ముద్దగుమ్మ..
మంచుకొండల్లో ముద్దగుమ్మ..
ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల ఫైన్
ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల ఫైన్
ఉత్తరాది ఓటర్లను ప్రభావితం చేసేందుకే అమిత్ షా వ్యాఖ్యలు: సజ్జల
ఉత్తరాది ఓటర్లను ప్రభావితం చేసేందుకే అమిత్ షా వ్యాఖ్యలు: సజ్జల
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..