అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు కామెంట్స్
అప్పట్లో పవన్ తన పార్టీతో ప్రయాణం చేశాడు. ఆ సమయంలో నేను నమ్మినవాళ్లు, చేరదీసిన వాళ్లే మోసం చేయడం పవన్ చూశాడు. ఆ అనుభవాల నుంచే జనసేన పార్టీ..

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో పాటు జనసేన సేన పార్టీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా జగన్ వైసీపీ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరు.. ఇప్పుడు తమ్ముడు పార్టీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా సినీ తారలంతా ఇంటికే పరిమితమవడంతో.. పలు ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. దీంతో వారి మనసుల్లో దాగిన మాటలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
గతంలో చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే కదా. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ యువ అధినేతగా వ్యవహరించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లే రావడంతో.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఎంపీ పదవి పొందారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాబినేట్‌లో స్వతంత్ర హోదా గల పర్యాటక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా ప్రస్తుతం రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం సినిమాలపై మాత్రమే ఆయన దృష్టి సారించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై చిరు మాట్లాడుతూ.. అప్పట్లో పవన్ తన పార్టీతో ప్రయాణం చేశాడు. ఆ సమయంలో నేను నమ్మినవాళ్లు, చేరదీసిన వాళ్లే మోసం చేయడం పవన్ చూశాడు. ఆ అనుభవాల నుంచే జనసేన పార్టీ స్థాపించి ఇప్పుడు ముందుకెళ్తున్నాడు. మా దారులు వేరైనా గమ్యం ఒక్కటే. తన దారిలోకి వెళ్లి నేనేమి సలహాలు ఇస్తాను? తను ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటికి వస్తాడు. అమ్మను కలుస్తాడు.. అందరితో కలిసి సంతోషంగా భోజనం చేస్తాడు. ఇక మేమిద్దరం కలుసుకున్నప్పుడు పాలిటిక్స్ కంటే కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుకుంటామంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.
Read More:
తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు
లాక్‌డౌన్ ఇప్పుడే కాదు.. నిజాం కాలంలోనూ ఉంది! అప్పుడేం చేసేవారంటే?