ఇకపై ఖరీఫ్, రబీ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఖరీఫ్, రబీ పేర్లతో పిలుస్తూంటారు. అయితే ఈ పేర్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆ పేర్లకు బదులు వానాకాలం, యాసంగిగా..

ఇకపై ఖరీఫ్, రబీ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 10:01 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఖరీఫ్, రబీ పేర్లతో పిలుస్తూంటారు. అయితే ఈ పేర్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆ పేర్లకు బదులు వానాకాలం, యాసంగిగా మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆమోదం మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్ల పేరు ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటి నుంచి శాఖాపరమైన ఉత్తర్వులు, పత్రాల్లో వానాకాలం, యాసంగి పదాలనే వినియోగించనన్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయాలు, కార్పొరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయానికి ఈ మేరకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More: 

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

విజయవాడలో నాన్‌-వెజ్ బ్యాన్.. అధికారుల కీలక నిర్ణయం