బెంజ్ కారు నుంచి లోకల్ ట్రైన్ వరకు పడిపోయాం.. శ్రుతిహాసన్ ఓపెన్ కామెంట్స్
వకీల్ సాబ్, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్-1.. ఇలా బ్యాక్ బు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్- రజనీ కాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైంది.

స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ శ్రుతిహాసన్. శ్రుతి హాసన్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్. ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటుంది. అంతే కాదు పాన్ ఇండియా సినిమాల్లోనూ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య శ్రుతిహాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి. సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన శ్రుతి హాసన్. ఇప్పుడు బడా సినిమాలను లైనప్ చేసింది. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా ఒకటి. ఈ సినిమాతో పాటు సలార్ 2లోనూ నటిస్తుంది. అలాగే మరికొన్న్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు చిన్న గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రుతిహాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని తెలిపింది. కమల్ హాసన్ కూతురు అయిన శ్రుతిహాసన్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కమల్, సారిక కూతురు శ్రుతి. కమల్ సారికతో విడిపోయిన తర్వాత శ్రుతి తల్లితో కలిసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని తెలిపింది.
అమ్మ, నాన్న విడిపోయిన తర్వాత మా అమ్మ మమ్మల్ని తీసుకొని చెన్నై నుంచి వెళ్లిపోయారు. చెన్నై నుంచి మేము ముంబై వెళ్లాం. ఆ సమయంలో పెద్ద బంగ్లా నుంచి చిన్న ఇంటికి మారిపోయాం.. ఆ సమయంలో నేను చాలా పాఠాలు నేర్చుకున్నా.. మెర్సిడెస్ నుంచి లోకల్ ట్రైన్ వరకు పడిపోయాం అని శ్రుతిహాసన్ తెలిపింది. అప్పుడు జీవితం నేర్పిన పాఠాలకు నేను సంతోషిస్తున్నాను.మెర్సిడెస్ నుంచి లోకల్ ట్రైన్‌కు కూడా వెళ్లొచ్చని నేను నేర్చుకున్నాను. జీవితం ఎంత వేగంగా మారుతుందో తెలుసుకున్నా.. అని తెలిపింది. నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు. సంగీతం నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్లాను. అప్పుడు నా డబ్బులు నేనే సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నా.. నా డబ్బు నేను సంపాదించుకోవాలి, స్వతహాగా ఉండాలి, అనే భావన నాకు ఎల్లప్పుడు ఉండేది అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఏ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



