Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు!

అక్షయ తృతీయ రోజు తృణమో.. పణమో బంగారం కొంటే.. లక్ష్మీ దేవి ఇంట్లో నివాసముంటుందని, అన్ని శుభాలు జరుగుతాయని మహిళలు భావిస్తూంటారు. సాధారణంగా మనం ప్రతీ ఏడాది అక్షయ తృతీయ రోజు బంగారం షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తాం. కానీ ఈసారి అలా లేదు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం..

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 24, 2020 | 8:39 PM

అక్షయ తృతీయ రోజు తృణమో.. పణమో బంగారం కొంటే.. లక్ష్మీ దేవి ఇంట్లో నివాసముంటుందని, అన్ని శుభాలు జరుగుతాయని మహిళలు భావిస్తూంటారు. సాధారణంగా మనం ప్రతీ ఏడాది అక్షయ తృతీయ రోజు బంగారం షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తాం. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. అంతా రివర్స్ అయింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం లాక్‌‌డౌన్‌లో ఉంది. కేవలం నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవలు మినహా.. ఇంకేమీ అందుబాటులో లేవు. అయితే అనాదిగా వస్తోన్న ఆచారంతో చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ ఎలా కుదురుతుంది?.

అందులోనూ అక్షయ తృతీయను క్యాష్ చేసుకోవడానికి పలు బంగారు షాపులు కూడా ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి. కానీ ఈసారి అలా లేదు. దీంతో డిజిటల్ రూపంలో బంగారం కొనేందుకు పలు ఫ్లాట్‌ ఫామ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బంగారం ఫిజికల్‌గానే కాదు డిజిటల్ రూపంలో కూడా కొనవచ్చని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్, సీఎండి, టీఎస్ కళ్యాణరామ, తనిష్క్‌, మలబార్ వంటి పేరు మోసిన పలు బంగారం కంపెనీలు కూడా అక్షయ తృతీయకి ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నాయి. దీంతో పలు ఆన్‌లైన్ యాప్స్ పేటీఎం, ఫోన్‌ పే, మోతీలాల్ ఓస్వాల్, ఆగ్మంట్ తదితర వేదికల ద్వారా డిజిటల్ గోల్డ్‌ను రూపాయి నుంచే కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి.

సాధారణంగా మనం బంగారం షాపులకి వెళ్తే.. ఎంత లేదన్నా కనీసం ఒక గ్రాము కొనాల్సి ఉంటుంది. అయితే పేమెంట్ యాప్స్ ద్వారా బంగారాన్ని చిన్న మొత్తాల్లో కొనుగోలు చేస్తూ.. మీకు కావాల్సినంత సమకూరిన తరువాత.. దాన్ని హోమ్ డెలివరీ చేసుకునే సదుపాయం ఉంది. లేదంటే ఈ డిజిటల్ బంగారాన్ని ఆభరణాల సంస్థలకు బదిలీ చేసి అందుకు తగిన నగలను కొనుగోలు చేసుకునే సదుపాయం కూడా ఉంది. సో ఇప్పుడు దీన్నే ఆసరగా చేసుకుని బంగారం షాపులు ఈఎంఐ (EMI) ఆఫర్లను కూడా ప్రటిస్తున్నాయి.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
రూ.15 వేలకే అదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే
రూ.15 వేలకే అదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే
ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌!
ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
రేపో మాపో కుక్క చావు చస్తావు..
రేపో మాపో కుక్క చావు చస్తావు..