AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా జన్మ సార్ధకమైనది.. ఇంతకంటే ఏం కావాలి!

ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోష పడ్డానో.. ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి..

నా జన్మ సార్ధకమైనది.. ఇంతకంటే ఏం కావాలి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2020 | 3:47 PM

Share

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమయ్యింది. మేడిగడ్డ మీదుగా గోదావరి జలాలు రంగనాయక సాగర్‌లో చేరాయి. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ పంప్‌హౌజ్‌లోని నాలుగు మోటర్లలో ఒక మోటర్‌ వెట్‌రన్‌ను ఇవాళ ప్రారంభించారు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు. నాలుగు మోటార్ల వెట్‌రన్‌ సందర్భంగా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు సకల జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోష పడ్డానో.. ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సీఎం కేసీఆర్ నిరూపించారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృష్టి మరవలేమన్నారు. సిద్ధిపేటకు గోదావరి జలాలు రావడం దశాబ్ధాల కల. అది ఇప్పుడు తీరింది. నా జన్మ సార్థకమైనది.. ఇంకంటే ఏం కావాలన్నారు హరీష్ రావు. ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టం.

ఇది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనం. భూమిలిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. భూమిలిచ్చి త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లికించబడి ఉంటుంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో సిద్ధిపేట నియోజక వర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. చెరువులు, కుంటలు నిండుతాయని హరీష్ రావు తెలిపారు.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు