గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

ఇప్పటివరకూ వాట్సాప్‌లో కేవలం నలుగురే గ్రూప్ కాల్స్ మాట్లడుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచింది వాట్సాప్. అంటే మీరు ఇప్పుడు ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్‌..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 4:42 PM

వాట్సాప్ యూజర్లకి గుడ్‌న్యూస్ చెప్పింది ఈ సంస్థ. సోషల్ మీడియా మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూ పోతుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో కేవలం నలుగురు మాత్రమే గ్రూప్ కాల్స్ మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచింది వాట్సాప్. అంటే మీరు ఇప్పుడు ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్‌లో మాట్లాడొచ్చు అన్నమాట.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం అందరూ వాట్సాప్ వీడియో కాల్సే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆసక్తిని గమనించిన వాట్సాప్.. సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ ఈ అప్డేట్ రిలీజ్ చేసింది. ఒకవేళ మీరు బీటా యూజర్‌ అయితే మీ వాట్సాప్ V2.20.133 వర్షన్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇక బీటా, ఐ ఫోన్ వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులు అప్‌డేట్ చేసుకోవాలని వాబేటా ఇన్ఫో తెలిపింది. రెండు ఫ్లాట్‌ ఫామ్‌లలోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.

కాగా త్వరలో ఈ ఫీచర్‌ను భారత్‌లోని 40 కోట్ల మందికి యూజర్లకు అందించనుంది వాట్సాప్. అయితే ఇప్పటికే నలుగురు పార్టిసిపెంట్స్‌తో వీడియో, ఆడియో కాల్స్‌లో సమస్యలు ఉన్నాయని పలువురు యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

ఈ ‘బర్రె పిల్ల’ పాట నా బుర్రలోంచి పోవట్లేదు

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం