AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: 16 ఏళ్ల లోపు పిల్లలపై ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త నిబంధనలు.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

Instagram: వినియోగదారులకు భద్రతా చర్యలను ఫేస్‌బుక్, మెసెంజర్‌లకు విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియా కంపెనీ వెల్లడించింది. సోషల్ మీడియా యువకుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై పర్యవేక్షిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరిన్ని ఆప్షన్‌లను అందించడానికి మెటా..

Instagram: 16 ఏళ్ల లోపు పిల్లలపై ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త నిబంధనలు.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
Subhash Goud
|

Updated on: Apr 09, 2025 | 1:50 PM

Share

ఇన్‌స్టాగ్రామ్‌.. ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి తెలియని వారంటూ ఉండరేమో. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఇన్‌స్టాగ్రామ్‌ కీలకంగా మారింది. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవైఏళ్ల ముసలి వాళ్ల వరకు ఇన్‌స్టాగ్రామ్‌ అనేది తెగ ఫేమస్‌ అయిపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. దీంతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సైతం యాక్టివ్‌గా ఉంటున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లలో రకరకాల రీల్స్‌, వీడియోలు, సోషల్‌ మీడియా యాప్స్‌ వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. దీనిని గమనించిన ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇక నుంచి 16 ఏళ్ల లోపు ఉన్న చిన్నారు ఇన్‌స్టాలో లైవ్‌లోకి రావడానికి అనుమతి లేకుండా మార్పులు చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌ సవరించిన మార్పులు ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి రావాలంటే ముందుగా పిల్లల పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసింది. వారి అనుమతి లేనిదే లైవ్‌ ఆప్షన్‌ వాడుకోవడానికి వీలు లేదు. డైరెక్ట్‌ మెసేజ్‌లలో న్యూడిటీ ఉన్న కంటెంట్‌ కూడా తల్లిదండ్రుల అనుమతి లేకుండా 16 ఏళ్ల పిల్లలకు కనిపించదు. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్‌ పోస్టులో వెల్లడించింది.

తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తే తప్ప 16 ఏళ్లలోపు టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను వాడుకోలేరు. డైరెక్ట్ మెసేజ్‌ల్లో “న్యూడిటీ ఉన్న చిత్రాలు బ్లర్ అవుతాయి. దాన్ని చూసేందుకు ట్రై చేసినా వీలు కాదు. ఆ ఆఫ్షన్ ఆఫ్‌ చేయడానికి లేదు” దీనికి కూడా తల్లిదండ్రుల అనుమతి అవసరం అని మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

16 ఏళ్లలోపు వినియోగదారులకు భద్రతా చర్యలను ఫేస్‌బుక్, మెసెంజర్‌లకు విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియా కంపెనీ వెల్లడించింది. సోషల్ మీడియా యువకుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై పర్యవేక్షిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరిన్ని ఆప్షన్‌లను అందించడానికి మెటా సెప్టెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్ కోసం తన టీనేజ్ అకౌంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

టీనేజర్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఇప్పటికే ఉన్న రక్షణలు ఉంటాయి. వీటిలో టీనేజర్ల ఖాతాలను డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా సెట్ చేయడం, అపరిచితుల నుండి ప్రైవేట్ సందేశాలను బ్లాక్ చేయడం, ఫైట్ వీడియోలు వంటి సున్నితమైన కంటెంట్‌పై కఠినమైన పరిమితులు, 60 నిమిషాల తర్వాత యాప్ నుండి నిష్క్రమించడానికి రిమైండర్‌లు, నిద్రవేళల్లో నిలిపివేయబడిన నోటిఫికేషన్‌లు ఉన్నాయి. “ఫేస్‌బుక్, మెసెంజర్‌లోని టీనేజర్ ఖాతాలు అనుచితమైన కంటెంట్, అవాంఛిత పరిచయాన్ని పరిమితం చేయడానికి ఇలాంటి, ఆటోమేటిక్ రక్షణలను అందిస్తాయి. అలాగే టీనేజర్ల సమయం బాగా గడిపేలా చూసుకోవడానికి మార్గాలు ఉంటాయి” అని మెటా తెలిపింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..