కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం
ఇంటర్నేట్ వినియోగదారుల డేటా చోరీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా 26.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను దొంగిలించారు సైబర్ నేరగాళ్లు. వారికి సంబంధించిన ఈ మెయిల్స్, చిరునామాలు, పేర్లు, ఫేస్‌బుక్ ఐడీఎస్, పుట్టిన తేదీలు, ఫోన్ నెంబర్లు..

ఇంటర్నేట్ వినియోగదారుల డేటా చోరీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా 26.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను దొంగిలించారు సైబర్ నేరగాళ్లు. వీటి ద్వారా యూజర్స్‌కి సంబంధించిన ఈ మెయిల్స్, చిరునామాలు, పేర్లు, ఫేస్‌బుక్ ఐడీఎస్, పుట్టిన తేదీలు, ఫోన్ నెంబర్‌లను వారు తీసుకుంటున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సమాచారాన్ని రూ.41,500లకు అమ్మినట్టు సైబర్ రిస్క్ అసెస్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ 26 కోట్ల మంది వినియోగదారుల పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేయలేదని పేర్కొంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా ఎలా లీక్ అయిందో మాకు తెలీదని, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా లీక్ అయి ఉండొచ్చని సైబర్ అధికారులు తెలిపారు. ఈ సమస్యను ప్రస్తుతం మేం పరిశీలిస్తున్నాం. గత కొన్నేళ్లుగా వినియోగదారుల సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు వారు తెలియజేశారు. అలాగే ఫేస్‌బుక్ ప్రొఫైలకు సంబంధించి వినియోగదారులు సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. సెట్టింగ్‌లను మరింత కఠినతరం చేయాలని, ఈ మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని వారు చెబుతున్నారు.
కాగా గతేడాది డిసెంబర్‌లో 267 మిలియన్లకు పైగా వినియోగదారుల పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన డేటాబేస్ ఆన్‌లైన్లె బహిర్గతమైనట్లు పలు వార్తలు వచ్చాయి.
Read More:
ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..
సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..