తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా పెరుగుతోన్న కరోనా.. ఈ రోజు ఎన్ని కొత్త కేసులంటే?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతోన్నాయి. దాదాపు వెయ్యికి దగ్గరలో కోవిడ్ కేసులు చేరుతున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతోన్నాయి. దాదాపు వెయ్యికి దగ్గరలో కోవిడ్ కేసులు చేరుతున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 943కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 24 మంది మృతి చెందారు. అలాగే 194 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఈ రోజు కరోనాతో ఇద్దరు మరణించారు. అందులో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 19 చొప్పున కొత్త కేసులు నిర్థరణ అయినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 813కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 24 మంది మృతి చెందగా.. 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 669 మంది.
Read More:
ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..
సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..
పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్



