డాక్టర్ల భద్రతకే కఠిన చట్టం… మోదీ

కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్ష విధిస్తూ ఆర్డినెన్స్ తేవడం మన వైద్య సిబ్బంది రక్షణకేనని ప్రధాని మోదీ అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 8:27 pm, Wed, 22 April 20
డాక్టర్ల భద్రతకే కఠిన చట్టం... మోదీ

కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్ష విధిస్తూ ఆర్డినెన్స్ తేవడం మన వైద్య సిబ్బంది రక్షణకేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ప్రతి హెల్త్ కేర్ సిబ్బంది భద్రతకూ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమన్నారు. వైద్య సిబ్బంది ధైర్యంగా కరోనాను ఎదుర్కొంటున్నారని, వారి భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. వైద్య సిబ్బందిపై దాడులు చేసే వారికి  ఏడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానావిధిస్తూ ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ తెచ్చింది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి బెయిలు కూడా లభించదు. ఈ మేరకు 120 ఏళ్ళ నాటి చట్టాన్ని ప్రభుత్వం సవరించింది.