- Telugu News Photo Gallery Technology photos Best ACs at low price on Amazon, check details in telugu
Best ACs: మండే వేసవిలో కూల్ కూల్ ఆఫర్లు.. ఏసీలపై అమెజాన్‌లో బంపర్ డిస్కౌంట్లు
వేసవి ప్రారంభంలోనే ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. దీంతో చల్లని గాలిని అందించే ఏసీల కోసం పరుగులు తీస్తున్నారు. అయితే వాటిని కొనుగోెలు చేసేటప్పుడు కొన్ని అంశాలను గమనించాలి. సంప్రదాయ ఏసీలు ఆన్, ఆఫ్ చేయడం ద్వారా హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇన్వెర్టర్ ఏసీలు వీటికి భిన్నంగా పనిచేస్తాయి. మంచి నాణ్యతతో పనిచేస్తూ చక్కని, శుభ్రమైన గాలిని అందించే పలు కంపెనీల 1.5 టన్ను ఏసీలు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.
Updated on: Apr 09, 2025 | 5:01 PM

మధ్య తరహా గదులు అంటే 111 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే వాటికి క్యారియర్ 1.5 టన్ను ఇన్వెర్టర్ ఏసీ సరిపోతుంది. దీనిలో ఫ్లెక్సికూల్ ఇన్వెర్టర్ టెక్నాలజీ, 6 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫీచర్ తో చల్లని గాలి వీస్తుంది. వాయిస్ కమాండ్, 4800 వాట్ల శీతలీకరణ సామర్థ్యం, హెచ్ డీ అండ్ పీఎం 2.5 ఫిల్టర్లు, యాంటీ కోరోషన్ బ్లూ పూతతో కూడిన రాగి కాయిల్స్ తో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. స్టార్ట్ వైఫై ఎనేబుల్డ్ ఏసీ కోసం చూస్తున్న,టెక్నాలజీపై అవగాహన ఉన్నవారికి బాగుంటుంది. క్యారియర్ ఏసీని రూ.35,990కి అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలకు డైకిన్ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ చక్కగా సరిపోతుంది. దీనిలోని డ్యూ క్లీన్ టెక్నాలజీ, ట్రిపుల్ డిస్ ప్లే కారణంగా చల్లని గాలి బయటకు వస్తుంది. 52 డిగ్రీల ఎండ ఉన్నా సమర్థవంతంగా పనిచేస్తుంది. పీఎం 2.5 ఫిల్టర్ ద్వారా ఆరోగ్యకరమైన గాలి వస్తుంది. అతి తక్కువ శబ్ధంతో అధిక ఆపరేషన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. మన్నికైన రాగి కండెన్సర్ కాయిల్, 3 స్టార్ రేటింగ్, ఉత్పత్తిపై ఏడాది, పీసీబీపై 5 ఏళ్లు, కంప్రెసర్ పై 10 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు. డైకిన్ ఏసీని అమెజాన్ లో రూ.37,490కి అందుబాటులో ఉంది.

మీడియం సైజు గదులకు లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లింట్ ఏసీ బాగుంటుంది. 5 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫంక్షన్, వంద శాతం కాపర్ కాయిల్, గోల్డెన్ ఫిన్ ఆవిరిపోరేటర్, యాంటీ కొరోషన్ కోటింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. స్మార్ట్ 4 వే ఎయిర్ స్వింగ్ గాలిని అన్నివైపులా ప్రసరింపజేస్తుంది. స్వచ్ఛమైన గాలిని అందించే పీఎం 2.5 ఫిల్టర్, 52 డిగ్రీల వద్ద కూడా చల్లగా ఉంచడం, స్టెబిలైజర్ రహిత ఆపరేషన్ తదితర అదనపు సౌకర్యాలు ఉన్నాయి. లాయిడ్ ఏసీని రూ.41,490కు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

పానాసోనిక్ నుంచి విడుదలైన ఈ 1.5 టన్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ మీడియం సైజు గదులకు సరిపోతుంది. 3 స్టార్ రేటింగ్, 7 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫీచర్ తో చక్కని చల్లదనాన్ని అందిస్తుంది. శీతలీకరణను సర్దుబాటు చేసే ట్రూ ఏఐ టెక్నాలజీ, మ్యాటర్ - ఎనేబుల్డ్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. అలెక్సా,గూగుల్ హోమ్ వంటి స్మార్ట్ హోమ్ సిస్టమ్ కు అనుకూలంగా ఉంటుంది. పీఎం 0.1 ఫిల్టర్ ద్వారా శుభ్రమైన గాలి అందుతుంది. 55 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉన్నప్పుడూ చక్కగా పనిచేస్తుంది. అమెజాన్ లో రూ.37,490కి ఈ ఏసీని కొనుగోలు చేయవచ్చు.

సామ్సంగ్ 1.5 టన్ను స్ప్లిట్ ఏసీలోని డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెసర్ ద్వారా శక్తివంతమైన శీతలీకరణ అనుభవం పొందవచ్చు. ఏఐ ఎనర్జీ మోడ్ ను ఉపయోగించి శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడంతో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ శబ్దంతో పనిచేయడం, 5 దశల కన్వర్టిబుల్, 4 మార్గాల స్వింగ్, వైఫై కనెక్టివిటీ, అలెక్సా, గూగుల్, బిక్స్ బై ద్వారా వాయిస్ నియంత్రణ, స్మార్ట్ థింగ్స్ యాప్ లు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. సామ్సంగ్ ఏసీని అమెజాన్ లో రూ.36,490కి కొనుగోలు చేయవచ్చు.




