ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం
Maoists killed in Encounter : బీహార్ పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొందరు పారిపోయినట్లుగా తెలుస్తోంది. వారి కోసం భద్రత బలగాలు అడవిప్రాంతంలో గాలింపు చర్యలు చేేపట్టారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో […]
Maoists killed in Encounter : బీహార్ పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు.
దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొందరు పారిపోయినట్లుగా తెలుస్తోంది. వారి కోసం భద్రత బలగాలు అడవిప్రాంతంలో గాలింపు చర్యలు చేేపట్టారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో మూడు అత్యాధునిక తుపాకులు, భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో బీహార్ పోలీసులతో పాటు శస్త్ర సీమా బల్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయని అక్కడి పోలీస్ అధికారులు తెలిపారు.