బొలీవియా అధ్యక్షురాలికి సోకిన కరోనా వైరస్‌

మొన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సనారోకు సోకిన కరోనా నిన్న బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్‌ అనెజ్‌కూ అంటుకుంది.

బొలీవియా అధ్యక్షురాలికి సోకిన కరోనా వైరస్‌
Follow us
Balu

|

Updated on: Jul 10, 2020 | 11:32 AM

కరోనా వైరస్‌కు రాజు పేద అంటూ తేడాల్లేవు.. బీదా గొప్ప అని చూసుకోవడం లేదు.. ఎవరికి పడితే వారికి అంటుకుంటోంది.. చివరాఖరికి దేశాల అధ్యక్షులను కూడా వదలడం లేదు.. మొన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సనారోకు సోకిన కరోనా నిన్న బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్‌ అనెజ్‌కూ అంటుకుంది.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. వైద్య పరీక్షలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పుకున్నారు .. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ..ఐసోలేషన్‌లో ఉంటూ పని చేస్తున్నానని జీనిస్‌ తెలిపారు.

మొన్నీమధ్యనే ఈమె మంత్రివర్గంలోని నలుగురికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.. ఎందుకైనా మంచిదని జీనిన్‌ అనెజ్‌ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.. అందుతో ఆమెకు వైరస్‌ సోకినట్టు తేలింది.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మాడ్యురో తర్వాత ఆ దేశానికి పవర్‌ఫుల్‌ లీడర్‌ ఎవరయ్యా అంటే ఆ దేశ రాజ్యంగ అసెంబ్లీ అధ్యక్షుడు డియోస్‌డాడో కాబెల్లోనే! పాపం ఆయనకు కూడా కరోనా వైరస్‌ సోకింది.. బొలీవియాలో కోటికి పైగా జనాభా ఉన్నారు.. ఇప్పటి వరకు 43 వేల మందికి కరోనా వైరస్‌ సోకింది.. ఈ మహమ్మారి కారణంగా 1500 మంది మరణించారు.. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగాలి.. మరి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.