కరోనాకు మలైకా అరోరా “వంటింటి వైద్యం”
బాలీవుడ్ ప్రముఖులు మొత్తం ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. ఇలా ఇంటికే పరమితమైనవారికీ...
Malaika Arora Shares How to Boost Immunity : ముంబైలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. దీంతో కరోనా కేసులు భయపెట్టే స్థాయిలో పెరుగుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత పెరుగుతుండడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
దీంతో సెలబ్రిటీలు, బాలీవుడ్ ప్రముఖులు మొత్తం ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. ఇలా ఇంటికే పరమితమైనవారికీ.. బాలీవుడ్ తార మలైకా అరోరా “కరోనా చిట్కా”లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వంటింటి వైద్యంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని తెలిపారు. మన వంటింట్లో ఉండే పసుపు, అల్లం, ఆపిల్, వెనిగర్, పెప్పర్ తో కషాయాన్ని తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఎలా చేసుకోవచ్చో కూడా చేసి చూపించారు. వీటితోపాటు యోగాసనాలు కూడా వేస్తే కరోనా దగ్గరికి రాదన్నారు. మలైకా అరోరా చెప్పిన వంటింటి చిట్కాలను ఇప్పటికే చాలా మంది ఫాలో అవుతున్నారు.