షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. ఓ సాధారణ ఇంటికి రూ.25 లక్షలు..
తెలుగు రాష్ట్రాల్లో కరెంటు బిల్లులు షాక్‌కి గురి చేస్తున్నాయి. లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలకు ఈ విద్యుత్ బిల్లులతో బెంబేలెత్తిపోతున్నారు. వందల్లో వచ్చే బిల్లులు లక్షల్లో వస్తుంటే అయోమయానికి గురి చేస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి...
తెలుగు రాష్ట్రాల్లో కరెంటు బిల్లులు షాక్‌కి గురి చేస్తున్నాయి. లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలకు ఈ విద్యుత్ బిల్లులతో బెంబేలెత్తిపోతున్నారు. వందల్లో వచ్చే బిల్లులు లక్షల్లో వస్తుంటే అయోమయానికి గురి చేస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ఇంటికి ఏకంగా రూ.25 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసిన యజమానికి గుండెపోటు వచ్చినంత పనయింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కూడా షాక్ తిన్నారు.
హైదరాబాద్‌లోని లాలాపేటలో నివాసముండే ఓ వ్యక్తికి సాధరణంగా నెలకు రూ.500 నుంచి 600 కరెంట్ బిల్లు వచ్చేది. ఇక వేసవిలో అయితే వెయ్యి రావడమే ఎక్కువ. అలాంటింది ఇప్పుడు ఏకంగా రూ.25 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీయగా ఇంత బిల్లు జనరేట్ అయింది. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించగా.. అందుకు ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు. ఇక సదరు వినియోగదారుడి ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు.
Read More:
ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత