లాక్‌డౌన్‌ను పొడిగించిన ఆ రెండు రాష్ట్రాలు..

కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేస్తామని తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగోదశ లాక్ డౌన్ విషయంలో ప్రకటన వచ్చిన తర్వాత మినహాయింపులపై ఆలోచన చేస్తామని మహా సర్కార్ వెల్లడించింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ పొడిగించింది. […]

లాక్‌డౌన్‌ను పొడిగించిన ఆ రెండు రాష్ట్రాలు..
Follow us

|

Updated on: May 17, 2020 | 2:38 PM

కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేస్తామని తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగోదశ లాక్ డౌన్ విషయంలో ప్రకటన వచ్చిన తర్వాత మినహాయింపులపై ఆలోచన చేస్తామని మహా సర్కార్ వెల్లడించింది.

మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ పొడిగించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న కర్ఫ్యూ మే 31 వరకు ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. అయితే పరిమిత సంఖ్యలో ప్రజారవాణాను పునః ప్రారంభిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా మే 18 నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లలో కొన్ని సడలింపులు ఇస్తామన్నారు. కాగా, ఇవాళ్టితో మూడోదశ లాక్ డౌన్ ముగియనుంది.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!