సీట్లు ఖాళీలేవని.. సాక్షాత్తూ దేశ ప్రధానినే..

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో.. న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఓ రెస్టారెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. కాబోయే భర్తతో

  • Tv9 Telugu
  • Publish Date - 3:28 pm, Sun, 17 May 20
సీట్లు ఖాళీలేవని.. సాక్షాత్తూ దేశ ప్రధానినే..

Jacinda Ardern: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో.. న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఓ రెస్టారెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. కాబోయే భర్తతో కలిసి కాసేపు సరదాగా గడిపేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్తే సాక్షాత్తూ దేశ ప్రధాని అని తెలిసినా నిర్వాహకులు కాసేపు ఆమెను వెయిట్ చేయించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి జసిండా నిన్న దేశ రాజధాని వెల్లింగ్టన్‌లోని ఆలివ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.

కాగా.. జనంతో సీట్లు నిండిపోవడంతో కాసేపు వేచి చూడాలని రెస్టారెంట్ నిర్వాహకులు ప్రధానిని కోరారు. దీంతో ఆమె ఏమాత్రం నొచ్చుకోకుండా సీట్లు ఖాళీ అయ్యేంత వరకు వేచి చూశారు. అయితే, ఎంతకీ ఖాళీ కాకపోవడంతో వెనుదిరిగారు. సరిగ్గా అప్పుడే ఓ మేనేజర్ వారి వద్దకు పరుగున వచ్చి సీట్లు ఖాళీ అయ్యాయని చెప్పడంతో ప్రధాని జసిండా, క్లార్క్‌లు తిరిగి రెస్టారెంట్‌లోకి వెళ్లారు. అక్కడ కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల క్రితమే ఆంక్షలు సడలించడంతో రెస్టారెంట్లు తెరుచుకున్నాయి.