“మహా”లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 219 మంది మృతి..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు.. అటు మరణాలు కూడా వందల్లో నమోదవుతుండటం కలకలం..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు.. అటు మరణాలు కూడా వందల్లో నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 6,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,599కి చేరింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి 219 మంది మరణించారు. ఇక కరోనా నుంచి కోలుకుని గురువారం నాడు 4,067 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 1,27,259 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 93,652 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
6875 new #COVID19 positive cases, 219 deaths, 4067 recovered in Maharashtra today. The total number of positive cases in the state rises to 2,30,599 including 1,27,259 recovered, 93,652 active cases and 9,667 deaths: Public Health Department, Maharashtra pic.twitter.com/h84JgvhuP5
— ANI (@ANI) July 9, 2020