హైదరాబాద్ రోడ్ల నిర్మాణంపై కేటీఆర్ సమీక్ష

Minister KTR Review on Road Construction in GHMC : హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ(GHMC) ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎస్సార్డీపీ (SRDP) పనులు వేగంగా కొనసాగుతున్నాయని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను […]

హైదరాబాద్ రోడ్ల నిర్మాణంపై కేటీఆర్ సమీక్ష
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 09, 2020 | 8:39 PM

Minister KTR Review on Road Construction in GHMC : హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ(GHMC) ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎస్సార్డీపీ (SRDP) పనులు వేగంగా కొనసాగుతున్నాయని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో రోడ్ల విస్తరణ, నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. నగరాన్ని నాలుగుజోన్లుగా విభజించి ఒక్కో జోన్లో ప్రస్తుతం ఉన్న రోడ్లతోపాటు భవిష్యత్తులో నిర్మించాల్సినవి, విస్తరించాల్సినవి గుర్తించి నివేదిక అందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.