COVID-19: మహారాష్ట్రలో గత 24గంటల్లో కరోనాతో 555 మంది మృతి.. ఎన్ని కేసులంటే..?
Maharashtra Coronavirus cases: భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల కొత్త కేసులు, నాలుగు వేల మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా
Maharashtra Coronavirus cases: భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల కొత్త కేసులు, నాలుగు వేల మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారికి తోడు బ్లాక్ ఫంగస్ వ్యాధి కూడా విజృంభిస్తుండటతో అంతటా భయాందోళన నెలకొంది. కాగా.. దేశంలో కరోనా ప్రారంభం నాటినుంచి కేసులు, మరణాల పరంగా మొదటిస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది.
మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 29,644 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 555 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 55,27,092 కి పెరగగా.. మరణాల సంఖ్య 86,618 కి చేరింది. ఈ మేరకు మహరాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. కరోనా నుంచి గత 24గంటల్లో 44,493 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 50,70,801 కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,67,121 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకొని నియంత్రణకు కృషిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా పూణే, ముంబై మహానగరంలో కేసుల సంఖ్య భారీ పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
Also Read: