మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,642కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4,46,881 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగ 1,60,413 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 21 వేల మందికి పైగా మరణించారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ముంబై, థానే,పూణె నగరాల్లోనే నమోదవుతున్నాయి.
13,165 new #COVID19 cases and 346 deaths reported in Maharashtra today; 9,011 patients discharged. The total cases in the state rise to 6,28,642, including 21,033 deaths and 4,46,881 recovered patients. Active cases stand at 1,60,413: Public Health Department, Maharashtra pic.twitter.com/79uFGE92Z5
— ANI (@ANI) August 19, 2020
Read More :