ఢిల్లీలో తెరచుకోనున్న మార్కెట్లు, హోటళ్లు..?
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో ఢిల్లీలో మార్కెట్లు, హోటళ్లను తిరిగి తెరిచేందుకు

ఢిల్లీలోని హోటళ్లను తిరిగి తెరవడానికి ఢిల్లీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ బుధవారం అనుమతి ఇచ్చింది. అయితే జిమ్‌లు మాత్రమే మూసే ఉండనున్నాయి. హోటళ్లు, జిమ్‌లు, వీక్లీ మార్కెట్లను తిరిగి ప్రారంభించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. గత కొద్ధి రోజులుగా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అయితే వీక్లీ మార్కెట్లు, వ్యాయామశాలలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తే మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో సర్కారు ప్రతిపాదనను ఎల్జీ కార్యాలయం తిరస్కరించింది. బుధవారం ఎల్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మొదట హోటళ్లు, వ్లీకీ మార్కెట్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!