AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూరత్‌లో బాంద్రా సీన్‌ రిపీట్‌.. పెద్ద ఎత్తున ఆందోళన రాళ్లదాడి…

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వలస కార్మికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేసినా.. కొందరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా.. స్వస్థలాలకు పయనమవుతున్నారు. మరికొందరైతే లాక్‌డౌన్ ఉన్నా కూడా.. ఆందోళనలకు దిగుతున్నారు. ఇటీవల ముంబైలోని ఓ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వలస కార్మికులు రైల్వే స్టేషన్‌ […]

సూరత్‌లో బాంద్రా సీన్‌ రిపీట్‌.. పెద్ద ఎత్తున ఆందోళన రాళ్లదాడి...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 4:50 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వలస కార్మికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేసినా.. కొందరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా.. స్వస్థలాలకు పయనమవుతున్నారు. మరికొందరైతే లాక్‌డౌన్ ఉన్నా కూడా.. ఆందోళనలకు దిగుతున్నారు. ఇటీవల ముంబైలోని ఓ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వలస కార్మికులు రైల్వే స్టేషన్‌ ముందుకు వచ్చి ఆందోళనలకు దిగారు. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో కూడా అదే సీన్ రిపీట్‌ అయ్యింది. అయితే ఇక్కడ మాత్రం రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. డైమండ్ బుష్ వద్దకు వేలాది మంది చేరుకుని ఆందోళనలకు దిగారు. అంతేకాదు.. పోలీసులపైకి రాళ్లదాడికి కూడా చేశారు.

తమను సొంత ఊళ్లకు పంపాలంటూ భైఠాయించారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పకుండా… పోలీసులు వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు భయాందోళనలకు గురవుతూ.. తమ తమ స్వస్థలాలకు వెళ్తామంటూ ఆందోళన చేపడుతున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో.. ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు.. నిత్యావసరాలు అందించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ.. అవి పూర్తి స్థాయిలో అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారంతా వారి వారి స్వగ్రామాలకు వెళ్తామంటు ఆందోళన చేపడుతున్నారు.

Gujarat: Labourers protested and pelted stones at the office of Diamond Bourse in Surat, alleging that they were made to work amid #CoronavirusLockdown. Workers also demanded that they be sent back to their native places. pic.twitter.com/RmOVZaRumZ

— ANI (@ANI) April 28, 2020

జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?