మ‌ట‌న్ కిలో రూ. 700లు..స‌ర్కార్ ఆదేశాలు

లాక్‌డౌన్ నేప‌థ్యంలో మాంసం వ్యాపారులు ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. మాంసం డిమాండ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో వ్యాపారులు విచ్చ‌ల‌విడిగా ధ‌ర‌లు పెంచి విక్ర‌యిస్తున్నారు.

మ‌ట‌న్ కిలో రూ. 700లు..స‌ర్కార్ ఆదేశాలు
Follow us

|

Updated on: Apr 28, 2020 | 5:05 PM

తెలంగాణ‌లో లాక్‌డౌన్ నేప‌థ్యంలో మాంసం వ్యాపారులు ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. మాంసం డిమాండ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో వ్యాపారులు విచ్చ‌ల‌విడిగా ధ‌ర‌లు పెంచి విక్ర‌యిస్తున్నారు. అంతేకాదు, చాలా చోట్ల మాంసం క‌ల్తీ చేసి అమ్ముతున్న‌ట్లుగా ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు మాంసం ధరలను నియంత్రించేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో పర్యటించారు. సుమారు 11 మాంసం దుకాణాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో లైసెన్స్‌ లేని దుకాణాలపై కొరడా ఝుళిపించారు. ఈ మేర‌కు మాంసం ధ‌ర‌ను కూడా నిర్ణ‌యించారు.

సికింద్రాబాద్‌లోని కొన్ని మటన్ షాపుల్లో మాంసం క‌ల్తీ చేసి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు జీహెచ్ఎంసీ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక బృందాలు త‌నిఖీలు చేశాయి. లోపల సోదాలు చేసిన అధికారులు నకిలీ మాంసం అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేశారు. లాక్ డౌన్ స‌మ‌యంలో మాంసాన్ని ఎక్కువ ధరలకు విక్రయించ‌డంతో పాటు, ధరల సూచీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేర‌కు మ‌ట‌న్ ధ‌ర కిలో రూ. 700లుగా నియ‌మించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు ప్రతి దుకాణం ముందు అందరికీ కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ హెచ్చ‌రించింది.