బ్రేకింగ్.. కరోనా వ్యాధికి ప్లాస్మా చికిత్స మంచిది కాదా ?
కరోనా వ్యాధి చికిత్సకు ప్లాస్మా థెరపీ మంచిది కాదా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ థెరపీ.. చికిత్సకు ఉపయోగపడదని ప్రభుత్వం వెల్లడించింది. ఈ చికిత్సా విధానం సరైనదనడానికి ఆధారాలు లేవని పేర్కొంది. ప్లాస్మా చికిత్స పొందిన కరోనా రోగికి నయమైందని గానీ, ఈ థెరపీ మంచి ఫలితాలనిచ్చిందని గానీ అనడానికి ఆధారాలు లేవని, ఇది ఇంకా ప్రయోగ దశలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ […]
కరోనా వ్యాధి చికిత్సకు ప్లాస్మా థెరపీ మంచిది కాదా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ థెరపీ.. చికిత్సకు ఉపయోగపడదని ప్రభుత్వం వెల్లడించింది. ఈ చికిత్సా విధానం సరైనదనడానికి ఆధారాలు లేవని పేర్కొంది.
ప్లాస్మా చికిత్స పొందిన కరోనా రోగికి నయమైందని గానీ, ఈ థెరపీ మంచి ఫలితాలనిచ్చిందని గానీ అనడానికి ఆధారాలు లేవని, ఇది ఇంకా ప్రయోగ దశలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీనిపై జాతీయ స్తాయిలో అధ్యయనం చేస్తోందని ఆయన చెప్పారు. ఇది ప్రాణాంతకం కావచ్ఛునని కూడా అన్నారు. ఢిల్లీలో 49 ఏళ్ళ కరోనా రోగికి జరిపిన ప్లాస్మా థెరపీ చికిత్స సక్సెస్ అయిందని, దేశంలో ఇదే తొలి ఘటన అని గతవారం వార్తలు వచ్చాయి. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి యాంటీ బాడీలను తీసి విషమ స్థితిలో ఉన్న రోగులకు ఇవ్వడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి కోలుకోగలుగుతారన్న థియరీ ప్రముఖంగా పతాక వార్తలకెక్కింది. ఒక డోనర్ 400 మిల్లీ లీటర్ల ప్లాస్మా ను ఇస్తే ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్ఛునని డాక్టర్లు చెబుతుండగా ఇది మంచిది కాదన్నట్టు ప్రభుత్వం చేస్తున్న ప్రకటన దీనిపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది. ముంబైలో మంగళవారం ప్లాస్మా థెరపీ ట్రయల్స్ ను ప్రారంభించబోతున్నారు.