కరోనా హాట్‌స్పాట్‌గా కొండాపూర్ ఆస్పత్రి
హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 10 మంది వైద్య సిబ్బంది, నలుగురు పేషెంట్లకు కరోనా సోకింది. దీంతో వారందరికి అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే కొండాపూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం ఈ ఆసుపత్రిలో 15మందికి కరోనా వైరస్ సోకినట్లైయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. నిత్యం 150కిపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతూ నగరంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ కట్టడికి […]
హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 10 మంది వైద్య సిబ్బంది, నలుగురు పేషెంట్లకు కరోనా సోకింది. దీంతో వారందరికి అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే కొండాపూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం ఈ ఆసుపత్రిలో 15మందికి కరోనా వైరస్ సోకినట్లైయింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. నిత్యం 150కిపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతూ నగరంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా..వైరస్ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. అటు ప్రభుత్వం కూడా ఇవాళ్టి నుంచి హైదరాబాద్ సహా మిగతా 5 జిల్లాల్లో 50వేల మందికి కరోనా టెస్టులను నిర్వహిస్తోంది. వచ్చే 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కృషి చేస్తోంది.