దేశవ్యాప్తంగా 1016 ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు: ఐసీఎంఆర్
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 1016 ల్యాబ్‌ల్లో
India Now Has 1016 Dedicated Labs: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 1016 ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. వీటిలో 737 ప్రభుత్వ ల్యాబొరేటరీలు ఉండగా, 279 ప్రయివేట్ ల్యాబ్ లు ఉన్నాయని తెలిపింది. గడచినా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,15,446 శాంపిల్స్ సేకరించామని వెల్లడించింది. ఇప్పటివరకు 77,76,228 టెస్టులు చేసినట్లు తెలిపింది. జనవరి 23న కేవలం ఒక ల్యాబొరేటరీ ఉండగా మర్చి 23 నాటికి 160, జూన్ 25నాటికి 1016 ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశామంది.
Also Read: కరోనా ఎఫెక్ట్: ఆ రాష్ట్రంలో జులై 31వరకు లాక్‌డౌన్..