పాకిస్తాన్‌లో దారుణం.. ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరికి ఫేక్ లైసెన్స్..!
ఇటీవల పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం విదితమే. పాకిస్తాన్ లో నకిలీ సర్టిఫికెట్ల బెడద ఊహించని రేంజ్‌కు వెళ్లిపోయింది. పాక్‌లో కొన్ని పైలట్ లైసెన్సులు కూడా
Plane crash probe: ఇటీవల పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం విదితమే. పాకిస్తాన్ లో నకిలీ సర్టిఫికెట్ల బెడద ఊహించని రేంజ్‌కు వెళ్లిపోయింది. పాక్‌లో కొన్ని పైలట్ లైసెన్సులు కూడా నకిలీవేనట. ఒకరో ఇద్దరో కాదు.. దురదృష్టవశాత్తూ అక్కడ ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్ లైన్సెసులతోనే హ్యాపీగా బతికేస్తున్నారట. ఇదేమీ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ విషయం కాదు.. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంతో గుండె చెదిరిన పౌర విమానాయ శాఖ మంత్రి స్వయంగా బయటపెట్టిన దారుణ వాస్తవం.
ఈ క్రమంలో పాకిస్తాన్ లో 30 శాతం పైచిలుకు పైలట్లు విమానం నడిపేందుకు అనర్హులు. వారెవరూ పరీక్షకు స్వయంగా హాజరు కాలేదు. తమ తరఫున పరీక్ష రాసేందుకు కొందరికి డబ్బులిచ్చి పంపారు. విమానం నడపడంలో వారికి కావాల్సినంత అనుభవం లేదు’ అని నిండు సభలో మంత్రి ప్రకటించారు. పాక్ సంస్థల్లో ప్రస్తుతం దాదాపు 860 మంది పైలట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే నకిలీ లైసెన్సులు గలవారందరినీ ప్రభుత్వం తక్షణం సస్పెండ్ చేసింది.