హోం క్వారంటైన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి?

హోం క్వారంటైన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి?

క‌రోనా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నీడ‌లా వెంటాడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి క‌రోనా ఎఫెక్ట్‌తో హోంక్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే...

Jyothi Gadda

|

May 02, 2020 | 4:38 PM

క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. భార‌త్‌లో కోవిడ్ భూతం జ‌డ‌లు విచ్చుకుంటోంది. ప్ర‌ధాని మొద‌లు..సామాన్య ప్ర‌జానీకం వ‌ర‌కు ఎవ్వ‌రూ గ‌డ‌ప‌దాటి బ‌య‌ట కాలుపెట్టాలంటేనే భ‌య‌ప‌డేలా చేస్తోంది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ నుంచి ప‌లువురు గ‌వ‌ర్న‌ర్ నివాసాల వ‌ర‌కు ఆక్ర‌మించేసిన క‌రోనా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నీడ‌లా వెంటాడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి క‌రోనా ఎఫెక్ట్‌తో హోంక్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయనను ఇంటర్వ్యూ చేసిన ఒక మీడియా ప్రతినిధికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కిషన్ రెడ్డి స్వయంగా హోంక్వారంటైన్ కు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక తెలుగు టీవీఛానెల్ ఢిల్లీ విలేకరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరిక్షలు నిర్వహించారు. ఆ విలేకరి ఎవరెవరిని కలిశారన్న కోణంలో సమాచార సేకరణ చేస్తున్నారు. కాగా ఆ విలేకరి ఇటీవల రెండు సార్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కిష‌న్ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్లుగా స‌మాచారం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu