చేతులకు సంకెళ్ళతో.. భారతీయులను మలేషియా రోడ్లపై..!

ఏ దేశం చూసినా లాక్‌డౌన్‌ ఆంక్షలే! ఎక్కడికక్కడ భారతీయులు చిక్కుకుపోయారు.. కొందరిని కేంద్రం చొరవ తీసుకుని ఇండియాకు తీసుకొస్తోంది. కానీ మలేషియాలో మాత్రం భారతీయులు చిక్కుకుపోవడం ఏకంగా అరెస్టల వరకు వెళుతోంది. విషయమేమిటంటే.. మలేషియాలోని మజీద్‌ ఇండియాలో దాదాపు వెయ్యి మంది భారతీయులు అందులో చిక్కుకున్నారు. వాళ్లల్లో రెండువందల మంది వరకు తెలుగువారు ఉన్నారు. ఉన్నపళంగా వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కుకున్న వారిలో ఉద్యోగులు, విద్యార్థులు, టూరిస్టులు ఉన్నారు. మామూలుగా అయితే ఈపాటికి ఇండియాకు వచ్చేసేవారు. […]

చేతులకు సంకెళ్ళతో.. భారతీయులను మలేషియా రోడ్లపై..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 02, 2020 | 4:28 PM

ఏ దేశం చూసినా లాక్‌డౌన్‌ ఆంక్షలే! ఎక్కడికక్కడ భారతీయులు చిక్కుకుపోయారు.. కొందరిని కేంద్రం చొరవ తీసుకుని ఇండియాకు తీసుకొస్తోంది. కానీ మలేషియాలో మాత్రం భారతీయులు చిక్కుకుపోవడం ఏకంగా అరెస్టల వరకు వెళుతోంది. విషయమేమిటంటే.. మలేషియాలోని మజీద్‌ ఇండియాలో దాదాపు వెయ్యి మంది భారతీయులు అందులో చిక్కుకున్నారు. వాళ్లల్లో రెండువందల మంది వరకు తెలుగువారు ఉన్నారు. ఉన్నపళంగా వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కుకున్న వారిలో ఉద్యోగులు, విద్యార్థులు, టూరిస్టులు ఉన్నారు. మామూలుగా అయితే ఈపాటికి ఇండియాకు వచ్చేసేవారు. కానీ లాక్‌డౌన్‌ కంటిన్యూ అవ్వడం, ట్రావెల్‌ బ్యాన్‌ ఉండటంతో వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయారు. ఇమిగ్రేషన్‌ అధికారులకు అదే ఆసరాగా దొరికింది. కొంతమందిని వెరిఫికేషన్‌ పేరుతో వేరే చోట ఉంచారు. ఇంకొంత మందిని అరెస్ట్‌ కూడా చేశారు. దీంతో ఏదో ఒక విధంగా తమ వెతలు తీర్చాలంటూ వేడుకుంటున్నారు.