Night Curfew: రోజు రోజుకీ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. రాత్రి కర్ఫ్యూను ప్రకటించిన కేరళ సర్కార్..
కేరళ ప్రభుత్వం డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2023 ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. కర్ఫ్యూ రాత్రి 10 నుండి..
దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నమోదైన కేసులతో 300 మార్కుని దాటేశాయి. కేరళ ప్రభుత్వం డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2023 ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. కర్ఫ్యూ రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. దుకాణాలు, సంస్థలు రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కారణం లేకుండా బహిరంగంగా గుమిగూడవద్దని కేరళ ప్రభుత్వం పౌరులను కోరింది.
డిసెంబర్ 31 రాత్రి 10 గంటల తర్వాత నూతన సంవత్సర వేడుకలు కొనసాగించరాదని కేరళ ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. సోమవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన కోవిడ్-19 సమీక్ష సమావేశంలో 10 తర్వాత నూతన సంవత్సర వేడుకలను అనుమతించబోమని నిర్ణయించారు. డిసెంబర్ 31న PM మరియు బార్‌లు, క్లబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, తినుబండారాలలో సీటింగ్ కెపాసిటీ 50%గా ఉంటుందని ఒక ప్రకటన తెలిపింది.
డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ కనీసం మూడు రెట్లు ఎక్కువగా వ్యాప్తి చేయగలదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం గత వారం రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. వెంటనే వార్ రూమ్‌లను “యాక్టివేట్” చేయాలని.. జిల్లాలో కఠినమైన, సత్వర నియంత్రణ చర్యలను కొనసాగించాలని కోరింది.
ఇవి కూడా చదవండి: Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..
Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!