Hemant Soren: అంత ఖర్చు మా వల్ల కాదు.. అందరికీ ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్ అందించాలి.. ప్రధానికి సోరెన్ లేఖ

Jharkhand CM Hemant Soren writes to PM Narendra Modi: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని ప్రధానమంత్రి

Hemant Soren: అంత ఖర్చు మా వల్ల కాదు.. అందరికీ ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్ అందించాలి.. ప్రధానికి సోరెన్ లేఖ
Hemant Soren
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2021 | 4:38 PM

Jharkhand CM Hemant Soren writes to PM Narendra Modi: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా కోవిడ్ టీకాల కొరత, పలు అంశాలపై హేమంత్ సోరెన్ ప్రస్తావించారు. జార్ఖండ్ రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కోవిడ్ టీకాలు వేసేందుకు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, రాష్ట్రం ఇంత మొత్తాన్ని భరించే పరిస్థితిలో లేదని సీఎం సోరెన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించారు. కావున 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారికి కూడా కేంద్రమే టీకాలు వేయాలని కోరారు. పరిమిత వనరులతో తాము కరోనాతో పోరాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 1.57 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా టీకాలు పంపించాలని సీఎం ప్రధానిని కోరారు. దీంతో పాటు 12 నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లలకు టీకాలు వేయాలంటే మరో వెయ్యి కోట్లరూపాయలు అవసరమని సీఎం వివరించారు. తమ రాష్ట్రానికి సకాలంలో కోవిడ్ టీకాలు పంపించి సహకరించాలని సీఎం హేమంత్ సోరెన్ ప్రధానికి విన్నవించారు.

అయితే.. అంతకుముందు కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేంద్రంపై పలుమార్లు విమర్శలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేంద్రం నుంచి సరిపడా టీకా డోసులు రావడం లేదని సోరెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఇది పెద్ద అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రాలే తమ సొంతంగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడం భారత చరిత్రలో ఇదే తొలిసారని సోరెన్‌ అభిప్రాయపడ్డారు. యావత్తు దేశం కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న సమయంలో టీకాల సమీకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టడం ఎంతవరకు సమంజసమంటూ విమర్శించారు.

Also Read:

Amazon Youth Offer: 50% డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్… రూ.499కే ఏడాది ఆఫర్.. వివరాలు..

Viral Video: సరస్సులోకి దిగిన టూరిస్టులు.. వారిపైకి దూసుకొచ్చిన నీటి ఏనుగు.. చివ‌రికి ట్విస్ట్‌ ఏంటంటే?

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా