AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Youth Offer: 50% డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్… రూ.499కే ఏడాది ఆఫర్.. వివరాలు..

Amazon Prime Subscription: కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ తెలిపింది. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకునే 50శాతం డిస్కౌంట్‌తో యూత్ ఆఫర్‌ను ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ కోసం మీరు ఏడాదికి రూ.999 చెల్లించాల్సిన

Amazon Youth Offer: 50% డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్... రూ.499కే ఏడాది ఆఫర్.. వివరాలు..
Amazon Prime
Shaik Madar Saheb
|

Updated on: Jun 01, 2021 | 4:24 PM

Share

Amazon Prime Subscription: కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ తెలిపింది. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకునే 50శాతం డిస్కౌంట్‌తో యూత్ ఆఫర్‌ను ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ కోసం మీరు ఏడాదికి రూ.999 చెల్లించాల్సిన అవసరం లేదని.. కేవలం రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ పొందొచ్చని పేర్కొంది. అయితే ఇది పొందేందుకు షరతులు కూడా విధించింది. అదేంటంటే.. ఈ ఆఫర్ పొందేందుకు మీ వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ మేరకు అమెజాన్ ఇండియా యూత్ ఆఫర్ ను ప్రకటించింది. కొత్త ప్రైమ్ మెంబర్స్‌ని చేర్చుకోవడం కోసం, ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు అమెజాన్ ఇండియా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే.. 18 నుంచి 24 ఏళ్ల లోపు ఉన్న యువతీ, యువకులు ముందుగా రూ.999 చెల్లించి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అనంతరం ఏడాది సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అనంతరం వారికి రూ.500 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంటే ఒక ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కేవలం రూ.499 ధరకే లభిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే కాదు. మూడు నెలల మెంబర్‌షిప్ తీసుకున్నవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు రూ.164 ధరకే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. సాధారణంగా మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ కోసం రూ.329, ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ కోసం రూ.999 చెల్లించాలి. కానీ 18 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్నవారికి క్యాష్‌బ్యాక్ లభించడం వల్ల చాలా తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ లభిస్తోంది. దీనికోసం వయస్సు ధ్రువీకరణ చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్‌తో పాటు ఒక సెల్ఫీ అప్‌లోడ్ చేయాలి. వయస్సు ధృవీకరణ పూర్తైన తర్వాతే క్యాష్‌బ్యాక్ అమెజాన్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఏడాది సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి రూ.500, మూడు నెలల మెంబర్‌షిప్ తీసుకున్నవారికి రూ.165 క్యాష్‌బ్యాక్ వస్తుంది.

వాస్తవానికి ఈ ఆఫర్ గతంలో కూడా ఉండేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశాల మేరకు అమెజాన్ ఇండియా ఈ ఆఫర్‌లో కొన్ని మార్పులు చేసింది. ఆర్‌బీఐ ఆదేశాలతో అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ కూడా చేర్చింది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఉంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ యాక్సెస్ కూడా లభిస్తుంది. అమెజాన్‌ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే ఉచిత డెలివరీ పొందొచ్చు.

Also Read:

Watch: మరి కాసేపట్లో పెళ్లి.. గాల్లోకి వధువు కాల్పులు.. వీడియో వైర‌ల్.. ఆ తర్వాత ఏమైందంటే..?

MS Dhoni’s Ranchi farmhouse: ధోనీ ఫామ్ హౌస్ చూశారా..! చూడకుంటే చాలా మిస్ అవుతారు..!